News

ఎమ్మెల్యే రోజా ప్రశ్నలు


ఎమ్మెల్యే రోజా ఒక ప్రశ్న లేవనెత్తారు.తనను అకారణంగా, ఏ తప్పు చేయకపోయినా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, అదే ఓటు కు నోటు కేసుల అడ్డంగా దొరికిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శిక్షించరా అని ఆమె అన్నారు.మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావులు అసెంబ్లీలో ఇష్టారీతిన వ్యవహరించినా శిక్షించరా అని ఆమె అడిగారు. ముసునూరు ఎమ్.ఆర్.ఓ వనజాక్షి పై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమేనేని ప్రభాకర్ కు శిక్ష ఉండదా అని రోజా ప్రశ్నించారు. తాను పవన్ కళ్యాణ్ ను రబ్బర్ సింగ్ అన్నందునే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై స్పందిచారని, పవన్ అబిమానులు తనకు ఫోన్ చేసి చెప్పారని రోజా పేర్కొన్నారు.